ముర్రే.. హిప్ హిప్ హుర్రే..!

10 Nov, 2016 20:36 IST|Sakshi
ముర్రే.. హిప్ హిప్ హుర్రే..!

బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో తొలిసారి నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్గా అవతరించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్కు చేరడం ద్వారా అతడు ఈ ఘనత వహించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకులలో ముర్రే టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ముర్రే ఖాతాలో 11,185 పాయింట్లుండగా, జొకోవిచ్ ఖాతాలో 10,780 పాయింట్లు ఉన్నాయి.

స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకూ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సెర్బియా యోధుడు నొవాక్ జోకొవిచ్ ఈ టోర్నీలో క్వార్టర్స్ లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. ఈ ఏడాది ఒలింపిక్స్ స్వర్ణంతో పాటు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ లోనూ స్వర్ణం నెగ్గిన ముర్రే.. వరుసగా సింగిల్స్ లో రెండు స్వర్ణాలు నెగ్గిన టెన్నిస్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు