'టాప్'కు గెలుపు దూరంలో..

5 Nov, 2016 14:36 IST|Sakshi
'టాప్'కు గెలుపు దూరంలో..

పారిస్:ఎప్పట్నుంచో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకుపై కన్నేసిన బ్రిటన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే దాన్ని సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.  తాజాగా జరుగుతున్న పారిస్ మాస్టర్స్ టోర్నీలో సెమీ ఫైనల్లో ముర్రే విజయం సాధించినట్లయితే వరల్డ్ నంబర్ వన్గా నిలుస్తాడు.  ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో థామస్ బెర్డిచ్పై విజయం సాధించిన ముర్రే.. సెమీస్ అడ్డంకిని అధిగమించిన క్రమంలో నంబర్ వన్ ర్యాంకు కూడా సొంతం చేసుకుంటాడు.

 

ఇప్పటికే వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానాన్ని ముర్రే ఆక్రమించే అవకాశాలున్నాయి. శనివారం జరిగే సెమీఫైనల్లో రోనిచ్తో ముర్రే తలపడనున్నాడు. ఈ టోర్నీలో వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్.. మారిన్ సిలిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో అతను టాప్ ర్యాంకును కోల్పోయే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. దాదాపు 122 వారాలుగా జొకోవిచ్ నంబర్ వన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు