ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ వాయిదా 

30 May, 2020 10:04 IST|Sakshi

ఆక్లాండ్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో మెగా టోర్నమెంట్‌ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగాల్సింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టోర్నీకి అర్హత పొందిన క్రీడాకారులే వాయిదా పడిన టోర్నీలో ఆడతారని బీడబ్ల్యూఎఫ్‌ వివరించింది.    

మరిన్ని వార్తలు