బంగ్లాదే టి20 సిరీస్‌

12 Mar, 2020 06:23 IST|Sakshi

ఢాకా: జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2–0తో గెలుచుకుంది. బుధవారం జరిగిన రెండో టి20లో బంగ్లా 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 119 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రెండన్‌ టేలర్‌ (48 బంతుల్లో 59 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. క్రెయిగ్‌ ఇర్విన్‌ 29 పరుగులు చేశాడు. ముస్తఫిజుర్‌ రహమాన్, అమిన్‌ హుస్సేన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్‌ 15.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ లిటన్‌ దాస్‌ (45 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు) చెలరేగగా, మొహమ్మద్‌ నయీమ్‌ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా