క్రికెటర్‌ రింకూ సింగ్‌పై వేటు

30 May, 2019 17:01 IST|Sakshi

ముంబై: ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌ మూడు నెలలు పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మూడు నెలలు అతను ఏ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకూడదంటూ ఆంక్షలు విధించింది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఒక అనధికారిక టీ20 టోర్నీలో రింకూ సింగ్‌ పాల్గొనడమే అతనిపై వేటుకు కారణం. బీసీసీఐ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రింకూ విదేశీ లీగ్‌లో పాల్గొనడాన్ని తప్పుబడుతూ మూడు నెలల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది జూన్‌1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.  బోర్డు నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా రింకూపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున రింకూ సింగ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 19 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 24 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఇక 47 టీ20 మ్యాచ్‌లు గాను ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు.

మరిన్ని వార్తలు