గేల్‌ ధాటికి కొట్టుకపోయిన ఆఫ్రిది రికార్డు

21 Feb, 2019 09:25 IST|Sakshi

బ్రిడ్జిటౌన్‌: వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ నయా రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు(488) సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది పేరిట ఉన్న అత్యధిక (476) సిక్సర్ల రికార్డును గేల్‌ చెరిపివేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గేల్‌ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌(398), శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య(352), టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (349), సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని (348)లు తరువాతి స్థానాలలో ఉన్నారు.

గేల్‌ మెరిసినా.. మ్యాచ్‌ గెలవలేదు
గేల్‌ సిక్సర్లు మైదానం బయట పడటంతో ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గేల్‌ (135; 129 బంతుల్లో 3ఫోర్లు, 12 సిక్సర్లు) వన్డే కెరీర్‌లో 24వ శతకం నమోదు చేశాడు. గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విండీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు జాసన్‌ రాయ్‌(123; 85 బంతుల్లో 15ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌(102; 97 బంతుల్లో 9ఫోర్లు)లు శతకొట్టారు. దీంతో మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 361 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ చేదించింది.     

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ పరాజయం 

‘సుల్తాన్‌’ ఎవరో?

‘సుల్తాన్‌’ ఎవరో?

ఐదోసారీ మనదే టైటిల్‌ 

ఇండియన్‌  ప్రేమించే లీగ్‌

అగ్రస్థానంలోనే మంధాన, జులన్‌

దృష్టంతా ఐపీఎల్‌పైనే.. వేరే ద్యాసే లేదు

‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?

ఆ రెండు జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..

రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

చాంప్స్‌ అక్షయ, పవన్‌ కార్తికేయ

అజయ్, మిథున్‌ పరాజయం

భారత్‌ ఖేల్‌ ఖతం 

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం 

మూడో సారి ‘సూపర్‌’ 

‘రైజింగ్‌’కు రెడీ

రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నాం!

ఐపీఎల్‌ విజేతలు వీరే..

దురదృష్టమంటే నీదే నాయనా?

దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

భారత్‌కు చుక్కెదురు 

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా

నవ్వుల కూలీ!

టబు వస్తున్నారా?

హ్యాపీ హనీమూన్‌

ప్రేమ..ప్రతీకారం