కోచ్‌ ఎంపికలో థర్డ్‌ అంపైర్‌?

6 Aug, 2019 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇప్పటివరకూ థర్డ్‌ అంపైర్‌ను ఆన్‌ ఫీల్డ్‌లోనే చూశాం. అయితే టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపికలో థర్డ్‌ అంపైర్‌ పాత్ర ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అసలు కోచ్‌ ఎంపికలో థర్డ్‌ అంపైర్‌ ఏమిటా అనుకుంటాన్నారా?.. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యతను కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ)కి అప్పగించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ముగ్గురు రు సభ్యులతో కూడి సీఏసీ బృందం ఒక నివేదకను కూడా సమర్పించింది. తాము ఎటువంటి వేరే క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం లేదని విషయాన్ని అందులో స్పష్టం చేసింది. దీనికి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. వారు ముగ్గురు సమర్పించిన నివేదకతో సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఏకీభవించారు.

అయితే వీరు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తారంటూ సీఓఏ సభ్యురాలైన డయానా ఎడ్జుల్లీ విన్నవిస్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన సమావేశంలో కూడా ఎడ్జుల్లీ ఇదే పునరావృతం చేశాడు కూడా.  దాంతో థర్డ్‌ అంపైర్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. కపిల్‌ కమిటేనే ఇంటర్యూలు చేసి కోచ్‌ను ఎంపిక చేసినప్పటికీ ఎథిక్‌ ఆఫీసర్‌ వారి సూచించిన దానిని మరోసారి పర్యవేక్షిస్తారన్నమాట. అంటే కపిల్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రామస్వామిలకు ఏకగ్రీవంగా తమ నిర్ణయాన్ని చెప్పే అధికారం ఉండదు. ఒకవేళ అదే జరిగితే కపిల్‌ కమిటీ కోచ్‌ను ఎంపిక చేసిన తర్వాత ఎథిక్‌ ఆఫీసర్‌ థర్డ్‌ అంపైర్‌ పాత్ర పోషించే అవకాశం ఉంది.

వచ్చే వారంలో టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాప్‌ ఎంపిక ప్రక్రియ ఆరంభం కానున్నట్లు వినోద్‌ రాయ్‌ పేర్కొన్నారు. ఆగస్టు, 13, 14 తేదీల్లో ఇంటర్యూలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కోచ్‌ల ఎంపికను కపిల్‌ కమిటీనే నిర్ణయిస్తుందన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశానికి సంబంధించి సీఏసీ సభ్యులు ఇచ్చిన నివేదకతో తాము సంతృప్తి చెందామన్నారు. టీమిండియా కోచ్‌ కోసం వచ్చిన దరఖాస్తులను బీసీసీఐ షార్ట్‌ లిస్ట్‌ చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఇందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనుందన్నారు. మరి కపిల్‌ కమిటీ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసిన తర్వాత దాన్ని ఎథిక్స్‌ కమిటీకి అప్పగిస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు