కటక్ వన్డే.. కష్టాల్లో లంక

2 Nov, 2014 19:49 IST|Sakshi

కటక్: కటక్ వన్డేలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లం 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. దిల్షాన్ (18) , సంగక్కర (13), తరంగ (28), ప్రసన్న (5), మహేల జయవర్ధనె (43) అవుటయ్యారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్  రెండు, ఇషాంత్, ఉమేష్, అశ్విన్ తలా వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ లంకేయులను కట్టడి చేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంకేయులు గెలవడం కష్టం.

ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113)  సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు