మళ్లీ అతనే నెంబర్‌ వన్‌

31 Oct, 2016 18:48 IST|Sakshi
మళ్లీ అతనే నెంబర్‌ వన్‌

మాడ్రిడ్‌: ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో సెర‍్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో జొకోవిచ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రిటన్‌ గ్రేట్‌ ఆండీ ముర్రే, స్విట్జర్లాండ్‌ ఆటగాడు వావ్రింకా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

జపాన్‌ ఆటగాడు నిషికోరి నాలుగో స్థానానికి చేరగా, మిలోస్‌ రయోనిక్‌ (కెనడా) ఐదో స్థానానికి దిగజారాడు. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఆరో స్థానంలో, స్విట్జర్లాండ్‌ కెరటం రోజర్‌ ఫెదరర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) ఏడు, డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) ఎనిమిది, మారిన్‌ సిలిక్‌ (క్రొయేషియా) 10 ర్యాంకుల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు