ఆ జట్టు 20 బంతుల్లోనే సున్నాకు ఆలౌట్‌!

12 Feb, 2016 15:17 IST|Sakshi
ఆ జట్టు 20 బంతుల్లోనే సున్నాకు ఆలౌట్‌!

లండన్‌: క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత విస్మయకర విషయం. గల్లీ క్రికెట్‌లోనూ ఇలాంటి వింత కనీవీని ఉండం. కానీ ఈ వింత ఇంగ్లండ్‌లో జరిగింది. ఓ ఇంగ్లిష్‌ క్రికెట్‌ జట్టు బరిలోకి దిగి.. 20 బంతులు ఎదుర్కొని.. 10 వికెట్లు కోల్పోయి.. అసలు స్కోరు బోర్డు తెరువకుండానే ఆలౌటైంది. అంతకుముందు 120 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్టు 120 పరుగులతో ఘనవిజయం సాధించింది. కెంట్ ప్రాంతీయ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌లో ఈ వింత చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలియడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బిత్తరపోయింది.

కంటెర్‌బరీ క్రికెట్ మైదానంలో బాప్‌చైల్డ్‌ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచులో ఈ వింత చోటుచేసుకుంది. ఇండోర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో బాప్‌చైల్డ్ జట్టు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా ఆలౌటైంది. అయితే ఆ జట్టును ఒక్క పరుగు చేయకుండా ఆలౌట్ చేసిన ప్రత్యర్థి జట్టుఆటగాళ్లే ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఇది నిజాయితీగా సాధ్యమైందా? అన్నది కూడా చెప్పలేని స్థితిలో తాము ఉన్నామని క్రైస్ట్ చర్చ్ జట్టు స్పిన్నర్ మైక్ రోస్ స్థానిక దినపత్రికకు తెలిపాడు. బౌలర్ వేసిన ఓ బంతి మాత్రమే బ్యాట్స్‌మన్ బ్యాటుకు తగిలి.. దానిని ఫీల్డిండ్‌ ద్వారా అడ్డుకున్న ఫీల్డర్‌ను తానేనని, అంతుకుమించి బ్యాటింగ్ అంటూ ఏమీ జరుగలేదని అతను చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు