ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు

14 Jan, 2017 01:06 IST|Sakshi
ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు

హైదరాబాద్‌: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సౌత్‌జోన్‌లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్‌కు సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ రీజినల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కమిటీ (ఆర్‌ఎస్‌పీసీ) అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌ ఎ.రాజగోపాల్, ఆర్‌ఎస్‌పీసీ సెక్రటరీ, పీఆర్‌ డీజీఎం విక్టర్‌ అమల్‌రాజ్‌ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షించారు. ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్‌ శ్రీధర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీ చండీగఢ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది.

సౌత్‌జోన్‌ ఎఫ్‌సీఐ జట్టు: డి.ఎస్‌. శ్రీధర్‌ (కెప్టెన్‌), సుమిత్‌ అహ్లావత్, వై. అముల్‌ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్‌ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్‌ సోనీ, ఎస్‌.గంగాధరన్, నవీన్‌ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్‌ కుమార్, ఎస్‌.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్‌.శ్రీనివాస్, వెంకటేశ్‌ సాగర్, హెచ్‌.చంద్ర శేఖర్‌.

మరిన్ని వార్తలు