రిచర్డ్స్‌, కోహ్లి రికార్డుపై కన్నేశాడు..

21 Jul, 2018 15:52 IST|Sakshi

బులవాయో: జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించి ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఫఖర్‌ జమాన్‌.. ఇప్పుడు వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ రికార్డుపై కన్నేశాడు.

అదేంటంటే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లాడిన ఫఖర్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో  కలిపి 980 పరుగులు సాధించాడు. మరో 20 పరుగులు చేస్తే అతడు వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరతాడు. విరాట్‌ కోహ్లీ 24 ఇన్నింగ్స్‌ల ద్వారా 2008లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరగా.. వెస్టిండీస్‌ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ 21ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.  

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌-జింబాబ్వే మధ్య ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో 20 పరుగులు చేస్తే చాలు ఫఖర్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కేవలం 18 ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడు అవుతాడు.  ఐదు వన్డేల సిరీస్‌ను పాక్‌ ఇప్పటికే 4-0తో కైవసం చేసుకుంది.

చదవండి: నయా 'జమానా'

మరిన్ని వార్తలు