'టీమిండియాపై మా వ్యూహం అదే'

20 Oct, 2017 12:38 IST|Sakshi

ముంబై: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో గురువారం జరిగిన రెండో ప్రాక్టీస్ వన్డేలో టామ్ లాథమ్  (108: 97 బంతుల్లో 7x4, 2x6) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న లాథమ్ వందకు పైగా స్ట్రైక్ రేట్ తో శతకం బాది కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఆదివారం వాంఖేడ్ స్టేడియం వేదికగా భారత్ తో జరుగనున్న తొలి వన్డేను ఉద్దేశించి లాథమ్ మాట్లాడాడు.

'భారత్ పై పైచేయి సాధించాలంటే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక్కడ  భారత సీమ్ బౌలర్ల కంటే స్పిన్నర్లే కీలకం. మా వ్యూహం కూడా స్సిన్నర్లపై ఎదురుదాడి చేయడమే. విరాట్ సేనపై ఆధిక్యాన్ని దక్కించుకోవాలంటే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ మ్యాచ్ లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఎడమ చేతి స్పిన్నర్లతో పాటు కరణ్ శర్మ లాంటి లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. వారితో ఆడిన అనుభవం భారత్ తో మ్యాచ్ లో మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. ప్రస్తుత భారత జట్టులో కుల్దీప్ యాదవ్, చాహల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. శ్రీలంక, ఆసీస్ జట్లపై ఇప్పటికే వారు సత్తాచాటుకున్నారు. భారత్ స్పిన్నర్లతోనే మా పోరు ఉంటుందని అనుకుంటున్నా. భారత జట్టులో ఉన్న స్పిన్నర్ల వీడియో ఫుటేజ్ లను పరిశీలిస్తున్నాం'అని లాథమ్ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు