మేము ముందు బ్యాటింగే చేయాలనుకున్నాం.. నా కల నేరవేరింది: రోహిత్‌

19 Nov, 2023 14:00 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు విజిల్‌  మోగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. ఈ తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. 

ఇక టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. "నిజంగా మాకు తొలుత బ్యాటింగ్‌ చేయాలనే ఉంది. పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అదే విధంగా ఇది మాకు చాలా పెద్ద మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్ధి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంటున్నాము. మేము ఈ వేదికలో ఆడిన ప్రతిసారీ ప్రేక్షకులు  మమ్మల్ని సపోర్ట్‌ చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తారు.

టోర్నీలో చివరి దశకు వచ్చాం. ఈ మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యం. టోర్నీ మొత్తం ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఆడి ఇక్కడకు వచ్చామో.. ఫైనల్లో కూడా అదే తీరును కనబరుస్తాము. ఒక ఒక వరల్డ్‌కప్‌ టోర్నీలో ఫైనల్లో జట్టుకు కెప్టెన్సీ చేయాలన్న నా కల ఈ రోజు నేరవేరింది.

ఈ మ్యాచ్‌లో బాగా ఆడి విజయం సాధించడమే మా లక్ష్యం. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత 10 మ్యాచ్‌ల్లో అదే చేశాం. ఈ మ్యాచ్‌లో కూడా 100 శాతం ఎఫెక్ట్‌ పెడతాం. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాం అని పేర్కొన్నాడు.
చదవండి: 
 

మరిన్ని వార్తలు