మహిళా క్రికెటర్లకూ గ్రేడింగ్!

22 May, 2015 01:25 IST|Sakshi

 ముంబై : భారత మహిళా క్రికెటర్లకు కూడా గ్రేడింగ్ విధానంలో ఏడాదికి నిర్ణీత మొత్తం చెల్లించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు ఫైనాన్స్ కమిటీ తాజాగా దీనిని ప్రతిపాదించింది. ఇది అమలైతే మిథాలీరాజ్, జులన్ గోస్వామివంటి సీనియర్ క్రికెటర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. మరో వైపు బీసీసీఐ గత రెండేళ్లలో లీగల్ వ్యవహారాలు, కోర్టు కేసుల నిమిత్తం రూ. 56 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

స్పాట్ ఫిక్సింగ్‌ను విచారించిన ముద్గల్ కమిటీకి రూ. 1.5 కోట్లు, సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీకి బోర్డు రూ. 3.90 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర సంఘాలకు ఇస్తున్న మౌలిక సౌకర్యాల మొత్తాన్ని ఈ ఏడాది రూ. 75 కోట్లకు పెంచాలని భావించినా... భారీ మొత్తంలో లీగల్ ఖర్చులు ఉండటంతో దానిని రూ. 50 కోట్లకే సరిపెట్టాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు