'ఏడు రోజుల్లో విశ్వ విజేతలవుతాం'

23 Mar, 2015 13:56 IST|Sakshi
'ఏడు రోజుల్లో విశ్వ విజేతలవుతాం'

ఆక్లాండ్: ఏడు రోజుల్లో ప్రపంచ విజేతలుగా అవతరిస్తామని దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ దీమా వ్యక్తం చేశాడు. కొత్త ఉత్సాహంతో ఉన్నామని, నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నామని ప్రాక్టీస్ సందర్భంగా ఆదివారం చెప్పాడు. తమ ఆటగాళ్లు సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చారని అన్నాడు. తమ జట్టులో పలువురు కొత్త ఆటగాళ్లు ఉన్నారని, వారి వరల్డ్ కప్ లో ఆడిన అనుభవం లేదని గుర్తు చేశాడు. తమపై పెద్దగా ఒత్తిడి లేదని అన్నాడు.

తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న తనకు సెమీస్ ఆడాలన్న కోరిక తీరబోతుందని సంతోషం వ్యక్తం చేశాడు. సెమీస్ లో గెలిచేందుకు తమ టీమ్ ఎంతో శ్రమిస్తోందని వెల్లడించాడు. తమ చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గప్టిల్ డబుల్ సెంచరీ గురించి మాట్లాడుతూ... క్రికెట్ లో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు