‘వైట్‌ వాష్‌’ చేయాల్సిందే..

20 Feb, 2020 13:23 IST|Sakshi

జెర్సీలపై సెటైర్లు..!

వెల్లింగ్టన్‌:  టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఇరు జట్లు తలో సిరీస్‌ గెలిచి ఇప్పుడు టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధమయ్యాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక‍్రవారం వెల్లింగ్టన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.  ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు బుధవారం మీడియాతో మాట్లాడటంతో పాటు ప్రి-సిరీస్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా షేర్ చేసింది.  (ఇక్కడ చదవండి: ‘టెస్టు’ సమయం)

దీనికి‘తొలి టెస్ట్ నేపథ్యంలో కెప్టెన్ల ఫొటో సమయం' అని క్యాప్షన్‌లో పేర్కొంది. అయితే దీనిపై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. ఇందుకు  ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లి, విలియమ్సన్‌లు వేసిన జర్సీలే కారణమయ్యాయి. ఇరు జట్ల జెర్సీల రంగుల్లో తేడా ఉండటంతో ఇది టైడ్ బట్టల సబ్బు ప్రకటనలో ఉందని ఒకరంటే.. ఉజాల వేసి ఉతకమని మరొకరు కామెంట్‌ చేశారు. న్యూజిలాండ్‌లో టైడ్‌ అందుబాటులో లేనట్లు ఉందని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘న్యూజిలాండ్‌ను టీమిండియా ‘వైట్‌ వాష్‌’ చేయాల్సిందే’ అని మరొక అభిమాని సెటైర్‌ వేశాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను కోహ్లి గ్యాంగ్‌ 5-0తో క్లీన్ స్వీప్ చేయగా, మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కివీస్‌ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 


 

మరిన్ని వార్తలు