సెన్సేషనల్‌ క్యాచ్‌.. జస్ట్‌ మిస్‌

22 Dec, 2019 15:46 IST|Sakshi

కటక్‌: అది ఒక క్యాచ్‌గా కేఎల్‌ రాహుల్‌ పట్టుకుని ఉంటే అతని కెరీర్‌లోనే చిరస్మరణీయంగా మిగిలిపోయేది. అదే సమయంలో సెన్సేషనల్‌ క్యాచ్‌ కూడా అయ్యేది. కానీ అది జస్ట్‌ మిస్‌ అయ్యింది. వెస్టిండీస్‌తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుతంగా ఎగిరి బంతిని పట్టుకున్నాడు.  కానీ ఆ సమయంలో బంతిని బౌండరీ బయటకు విసరడంలో విఫలం కావడంతో అది సిక్స్‌ అయ్యింది. కానీ రాహుల్‌ ఫీల్డింగ్‌ మాత్రం హైలైట్‌గా నిలిచింది.(ఇక్కడ చదవండి: షాయ్‌ హోప్‌ సరికొత్త రికార్డు)

భారత బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 28 ఓవర్‌ రెండో బంతిని హెట్‌మెయిర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌  కొట్టాడు. అది సునాయాసమైన సిక్స్‌ అనుకున్నారంతా. కానీ రాహుల్‌ మాత్రం దాన్ని క్యాచ్‌గా అందుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ఒకవైపుబంతిని అంచనా వేస్తూ గాల్లో ఎగిరి మరీ ఒడిసి పట్టుకున్నాడు. కాగా, బ్యాలెన్స్‌ చేసుకునే క్రమంలో బంతిని బౌండరీ బయటకు విసరడంలో విఫలమయ్యాడు.  దాంతో అది సిక్స్‌ గా హెట్‌మెయిర్‌ ఖాతాలో పడింది.  కానీ రాహుల్‌ ఫీల్డింగ్‌కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. వాటే ఫీల్డింగ్‌ అంటూ స్టేడియంలో భారత్‌ అభిమానులు సందడి చేశారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు