భారత్‌ ఈసారీ టాపరే 

3 May, 2019 04:46 IST|Sakshi

టెస్టుల్లో అగ్రస్థానంతో సీజన్‌ ముగింపు

వన్డేల్లో ఇంగ్లండే నం.1

వార్షిక ర్యాంకుల్ని ప్రకటించిన ఐసీసీ  

దుబాయ్‌: భారత్, ఇంగ్లండ్‌ జట్లు మళ్లీ అగ్రస్థానాలతోనే ఈ సీజన్‌నూ ముగించాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక ర్యాంకుల్లో భారత్‌ (113 పాయింట్లు) నంబర్‌వన్‌ టెస్టు జట్టుగా, ఇంగ్లండ్‌ (123 పాయింట్లు) వన్డేల్లో టాపర్‌గా తమ స్థానాల్ని నిలబెట్టుకున్నాయి. భారత్‌కు న్యూజిలాండ్‌ (111 పాయింట్లు) నుంచి పోటీ ఎదురైనా 2 పాయింట్లతో బయటపడింది. తాజా ర్యాంకుల గణనలో 2015–16 సీజన్‌ ప్రదర్శనను తొలగించి, 2016–17, 2017–18 సీజన్‌ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు.

భారత్‌ 2016 అక్టోబర్‌ నుంచి టెస్టుల్లో టాప్‌ ర్యాంకులో కొనసాగుతోంది. భారత్‌  116, కివీస్‌ 108 పాయింట్లతో ఉండగా... 2015–16 ప్రదర్శనను తీసేయడంతో భారత్‌ 3 పాయింట్లను కోల్పోయింది. ఎందుకంటే ఆ సీజన్‌లోనే భారత్‌ 3–0తో దక్షిణాఫ్రికాపై, 2–1తో శ్రీలంకపై ఎదురులేని విజయాలు సాధించింది. మరోవైపు వన్డేల్లో ఇంగ్లండ్, భారత్‌ (121), దక్షిణాఫ్రికా (115) టాప్‌–3 ర్యాంకుల్లో నిలిచాయి.  

మరిన్ని వార్తలు