భారత హాకీ జట్ల జోరు

21 Aug, 2019 04:39 IST|Sakshi
మన్‌దీప్‌

ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ ఫైనల్లో మహిళా, పురుషుల జట్లు  

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు నిర్మించిన స్టేడియంలో టెస్ట్‌ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఇందులో భారత హాకీ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన పోరులో పురుషుల జట్టు ఏకంగా అరడజను గోల్స్‌తో హోరెత్తించింది. దీంతో భారత్‌ 6–3 గోల్స్‌తో ఆతిథ్య జపాన్‌ను కంగుతినిపించి ఫైనల్‌ బెర్తు కొట్టేసింది. స్ట్రయికర్‌ మన్‌దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. మన్‌దీప్‌ 9, 29, 30 నిమిషాల్లో మూడు గోల్స్‌ చేశాడు. మిగతా వారిలో నీలకంఠ శర్మ (3వ ని.), నీలమ్‌ సంజీప్‌ (7వ ని.), గుర్జంత్‌ సింగ్‌ (41వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. నేడు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  

‘డ్రా’తో ఫైనల్‌కు...
భారత మహిళల జట్టు చైనాతో ‘డ్రా’ చేసుకొని ఫైనల్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ అయినా నమోదు కాలేదు. ఈ  ఫలితంతో భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో తలపడుతుంది.
 

మరిన్ని వార్తలు