వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు: ఆనంద్‌ మహీంద్ర వీడియో గూస్‌ బంప్స్‌ ఖాయం!

17 Nov, 2023 17:44 IST|Sakshi

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్‌ 19) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్‌ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్‌ చేశారు.

ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న  ఈ దృశ్యం తనకు గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్‌ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్‌ని సాధించేసింది. అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు  దేశ వ్యాప్తంగా  ఈ ఫైనల్‌  దంగల్‌ క్రేజ్‌  అలా ఉంది మరి.  ఈమ్యాచ్‌కు సంబంధించి  శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్‌ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న  తమ ఉద్యోగి ఈ క్లిప్‌ తీశారని ట్వీట్‌ చేశారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌  ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ  మ్యాచ్‌ను వీక్షించేందుకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు  గోల్బల్‌ పాప్‌ సింగర్‌ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. 

టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌ టైటిల్‌ పోరులో భారత్‌, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి.  ఈ సిరీస్‌లో  ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్‌ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు