సిరీస్ విజయంపై ధోనీసేన గురి

1 Sep, 2014 13:14 IST|Sakshi
సిరీస్ విజయంపై ధోనీసేన గురి

బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఘోరపరాజయం చవిచూసినా.. వన్డే సిరీస్లో పుంజుకున్న టీమిండియా సిరీస్ విజయంపై దృష్టిసారిస్తోంది. 2-0తో ముందంజలో ఉన్న ధోనీసేన హ్యాట్రిక్ విజయం సాధించడం ద్వారా మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మంగళవారం జరగనుంది.

తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ధోనీసేన వరుస విజయాలతో సమరోత్సాహంతో ఉంది. కాగా ఇంగ్లండ్కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. సిరీస్ గెలిచి అవకాశాల్లేని ఇంగ్లీష్ మెన్ కనీసం సమం చేసి గౌరవం దక్కించుకోవాలంటే  చివరి రెండు వన్డేల్లో గెలిచితీరాలి. ధోనీసేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. కుక్ సేన ఒత్తిడిలో ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు