భారత మహిళల ‘హ్యాట్రిక్’

1 Mar, 2016 00:17 IST|Sakshi
భారత మహిళల ‘హ్యాట్రిక్’

 ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్
 
కౌలాలంపూర్:  ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ రెండో డివిజన్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1తో ప్యుర్టోరికోపై, ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో 3-0తో పోర్చుగల్‌పై నెగ్గింది. ప్యుర్టోరికోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-5, 2-11, 7-11, 9-11తో దియాజ్ ఆడ్రియానా చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్‌లో షామిని 12-10, 11-9, 7-11, 11-5తో దియాజ్ మిలానిపై

తర్వాతి మ్యాచ్‌లో మధురికా 11-4, 11-9, 11-7తో రియోస్ డానిలిపై; రివర్స్ సింగిల్స్‌లో షామిని 11-7, 13-11, 8-11, 11-8తో దియాజ్ ఆడ్రియానాపై నెగ్గారు. పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 7-11, 11-8, 9-11, 11-9తో ఒలివర్ లీలపై; మౌమా దాస్ 11-5, 11-9, 11-6తో మార్టిన్స్ కాటియాపై; షామిని 11-1, 11-4, 11-8తో మైకేల్ ప్యాట్రికాపై గెలిచారు.

పురుషుల గ్రూప్ ‘ఎఫ్’ రెండో డివిజన్ రెండో రౌండ్‌లో టర్కీపై 3-0తో గెలిచిన భారత్... మూడో లీగ్ మ్యాచ్‌లో 0-3తో నైజీరియా చేతిలో ఓడింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11-5, 11-5, 11-7తో గుండుజు ఇబ్రహీంపై; రెండో సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-6, 11-7తో మెంజి జెన్‌కేపై; మూడో సింగిల్స్‌లో ఆంధోని అమల్‌రాజ్ 11-13, 11-4, 11-6, 11-7తో అబ్దుల్లాపై విజయం సాధించారు. తర్వాత నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సౌమ్యజిత్ ఘోష్ 5-11, 4-11, 3-11తో అరుణ ఖాద్రీ చేతిలో; శరత్ కమల్ 13-15, 6-11, 13-11, 5-11తో ట్రయోలా సెగున్ చేతిలో; ఆంథోని అమల్‌రాజ్ 13-11, 8-11, 9-11, 8-11తో అబిడున్ బోడే చేతిలో పరాజయం చవిచూశారు.

మరిన్ని వార్తలు