'ఐపీఎల్‌' ఆల్‌టైమ్‌ రికార్డు..!

9 Feb, 2018 12:14 IST|Sakshi
ఐపీఎల్‌ వేలంలో ప్రీతి జింతా, సెహ్వాగ్‌(ఫైల్‌ఫొటో)

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ లీగ్‌ల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)దే అగ్రస్థానం. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఆదరణ, వీక్షకులు, బ్రాండ్ పరంగా ఐపీఎల్ ముందంజలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ వేలానికి కూడా విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సాధారణంగా లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అభిమానులు.. ఈసారి ఐపీఎల్‌ వేలాన్ని కూడా భారీ స్థాయిలో వీక్షించారు. గత నెలలో ఐపీఎల్‌-11 సీజన్‌ కోసం బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలాన్నిభారీ స్థాయిలో వీక్షించారు.

ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయగా వేలం ప్రక్రియను 46.5 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. దాంతో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో టెలికాస్ట్ చేసింది. టీవీతో పాటు డిటిటల్ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఐదు రెట్లు పెరినట్లు స్టార్ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని స్టార్‌ ఇండియా ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు.

మరిన్ని వార్తలు