ఇంటివాడైన ఇర్ఫాన్ పఠాన్

8 Feb, 2016 19:32 IST|Sakshi
ఇంటివాడైన ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ ఆటగాడు,  బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటివాడయ్యాడు.  గత గురువారం మక్కాలో మోడల్ సాఫా బేగ్ తో ఇర్ఫాన్ వివాహం  జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి అతికొద్ది మంది మాత్రమే హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ మేరకు ఇర్ఫాన్ తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను  అతని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.  ప్రతీ ఒక్కరూ తమను ఆశీర్వదించాలని కోరుతూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.

ఇటీవల టీమిండియా జట్టులో పునరాగమనం చేయాలని ఇర్ఫాన్ ఆశించినా ఫలితం దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా భారత క్రికెటర్ల సెలక్షన్ లో ఇర్ఫాన్ కు అవకాశం దక్కుతుందని తొలుత భావించినా అతనికి నిరాశే  ఎదురైంది. ముస్తాక్ అలీ టోర్నీలో ఆకట్టుకున్న ఇర్ఫాన్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి కొంత వరకూ భరోసా వచ్చినా జట్టులో ఎంపిక కాలేదు. టీమిండియా ప్రస్తుత జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే భారత క్రికెట్ సెలక్టర్లు ఇర్ఫాన్ కు స్థానం కల్పించి ఉండకపోవచ్చనేది ఆటగాళ్ల ఎంపికను బట్టి అర్థమవుతోంది.

Election 2024

మరిన్ని వార్తలు