Sakshi News home page

భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం

Published Fri, Mar 8 2024 4:39 AM

RBI, Bank Indonesia sign MoU for use of local currencies for bilateral transactions - Sakshi

ఆర్‌బీఐ, బ్యాంక్‌ ఇండోనేíసియా ఒప్పందం

ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్, బ్యాంక్‌ ఇండోనేసియా గవర్నర్‌ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్‌ఆర్‌), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్‌) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్‌ వర్క్‌ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది.

Advertisement
Advertisement