పట్టు బిగిస్తున్న విరాట్ సేన

12 Dec, 2016 15:24 IST|Sakshi
పట్టు బిగిస్తున్న విరాట్ సేన

మొహాలి: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారత తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దాంతో భారత్ 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత తొలి సెషన్లో అత్యంత నిలకడగా ఆడింది.

 

మొదటి సెషన్లో అశ్విన్(72;113 బంతుల్లో 11 ఫోర్లు) వికెట్నే భారత్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో భారత స్కోరు 204 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఆరో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో భారత్ మూడొందల మార్కును చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, అశ్విన్-రవీంద్ర జడేజాల జోడి ఏడో వికెట్ కు 97 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ పైచేయి సాధించింది. మరొకవైపు జడేజా-జయంత్ యాదవ్ల జోడి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించి అజేయంగా క్రీజ్లో ఉండటంతో భారత్కు మ్యాచ్పై పట్టుదొరికింది.

మరిన్ని వార్తలు