క్రికెటర్ బూమ్రా తాత దీనగాథ

4 Jul, 2017 13:56 IST|Sakshi
క్రికెటర్ బూమ్రా తాత దీనగాథ

అహ్మదాబాద్:జస్ప్రిత్ బూమ్రా.. టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో రెగ్యులర్ బౌలర్. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బూమ్రా..  ఆపై అంచెలంచెలుగా ఎదిగి జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరొకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బూమ్రాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల ఐపీఎల్-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ సాధించడంలో బూమ్రాది క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం అటు క్రికెట్ జీవితాన్ని మంచి లగ్జరీ లైఫ్ను బూమ్రా బాగానే ఆస్వాదిస్తున్నాడు కూడా. అయితే బూమ్రా తాత దీనగాథను చూస్తే మాత్రం మనం చలించాల్సిందే. అంతటి స్థాయిలో ఉన్న క్రికెటర్ తాత దీనగాథ ఎంటా అని అనుకుంటున్నారా. ఇది నిజం.

ఉత్తరాఖండ్లో ఉద్దమ్ సింగ్ నగర్లో నివసిస్తున్న సంతోక్ సింగ్ బుమ్రానే మన క్రికెటర్ జస్ఫ్రిత్ బూమ్రాకు స్వయానా తాత. దాదాపు 10 ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనిది స్వతహాగా అహ్మదాబాద్ అయినప్పటికీ, బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు. తన చేసే వ్యాపారంలో నష్టం రావడంతో 2006లో ఉద్దమ్ నగర్ కు మారిపోయాడు సంతోక్ సింగ్. తనకున్న మూడు ఫ్యాక్టరీలను అమ్మేసి వలస వెళ్లిపోయాడు.

 

ఇప్పుడు 84 ఏళ్ల వయసులో పడరాని కష్టాలు పడుతున్నాడు.  ఒక రూమ్ లో ఒంటరిగా ఉంటూ బతుకు బండిని లాగుతున్నాడు. ముఖ్యంగా 2001లో బూమ్రా తండ్రి జస్విర్ సింగ్ మరణించిన తరువాత ఆ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోనే వారి మధ్య సంబంధం తెగిపోయి చెప్పుకునే బంధం మాత్రమే మిగిలందట. ఆ కారణంగానే స్టార్ క్రికెటర్ అయిన బూమ్రా తాత సంతోక్ కు ఇంత కష్టం వచ్చిందని స్థానికులు అంటున్నారు. కాగా, బూమ్రా ఎదుగుదలను చూసి మురిసిపోతున్న సంతోక్.. మనవడు ఆడే మ్యాచ్ ల్ని క్రమం తప్పకుండా టీవీల్లో చూస్తూ ఉంటానని తెలిపాడు. తాను మరణించే లోపు మనవడ్ని ఒకసారి కలవాలని ఆశపడుతున్నాడు సంతోక్.

>
మరిన్ని వార్తలు