పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!

31 Jul, 2019 15:44 IST|Sakshi
పృథ్వీ షా

భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షాపై బీసీసీఐ నిషేదం నవంబర్‌ వరకు కొనసాగనుండటంతో షాకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత సంవత్సరం అక్టోబర్‌లో డోపింగ్‌ పరీక్షలో షా విఫలమవడంతో అతడిపై బీసీసీఐ 8 నెలలపాటు నిషేధం విధించింది. మార్చి 16 నుంచి నవంబర్‌ వరకు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ 2015లో చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ‘పాపం షా.. దురదృష్టవంతుడు’ అన్న ట్వీట్‌ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోవటంతో క్రికెట్‌ అభిమానులు దాన్ని వెలికితీసి మరీ వైరల్‌ చేస్తున్నారు. గతంలోనూ ఆర్చర్‌ చేసిన చెప్పిన జోస్యం నిజమైంది. అతను ఊహించినట్టుగానే వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్‌ జట్టు టైటిల్‌ గెలిచింది.

చదవండి: అంతా నా తలరాత.. : పృథ్వీషా

డోపింగ్‌ టెస్టులో విఫలమయిన పృథ్వీపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. నిషేధం నవంబర్‌ వరకు కొనసాగుతుందన్న విషయం తెలిసిన పృథ్వీ షా భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు. తన దగ్గుమందు ఇంత పని చేస్తుంది అనుకోలేదని కలత చెందాడు. చిన్నపాటి అజాగ్రత్త వల్ల శిక్ష అనుభవిస్తున్నానన్నాడు. మిగతా క్రీడాకారులు తనను చూసైనా జాగ్రత్తపడతారని భావిస్తున్నానన్నాడు. చిన్న మందులైనా సరే క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. పృథ్వీ షా గత సంవత్సరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు.

>
మరిన్ని వార్తలు