నాకౌట్ ‘కూత’

20 Oct, 2016 23:30 IST|Sakshi
నాకౌట్ ‘కూత’

కబడ్డీ ప్రపంచకప్ సెమీస్ నేడు
కొరియా(vs)ఇరాన్ రాత్రి 8 గంటల నుంచి
భారత్(vs) థాయ్‌లాండ్ రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం

 


అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు థాయ్‌లాండ్‌తో, ఇరాన్ జట్టు కొరియాతో తలపడనున్నారుు. ప్రపంచకప్ ఎక్కడ, ఎప్పుడు జరిగినా విజేతగా నిలిచే భారత్‌కు ఈసారి తొలి లీగ్ మ్యాచ్‌లోనే కొరియా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుుతే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి భారత్ సత్తా చాటింది. మంచి అనుభవం కలిగిన రైడ్ విభాగంతో పాటు పటిష్ట డిఫెన్‌‌సతో నేటి సెమీస్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయాలని భావిస్తోంది. పూర్తిగా స్టార్ ఆటగాళ్లతో నిండిన భారత్‌కు అనూప్ కుమార్, రాహుల్ చౌదరి, పర్‌దీప్ నర్వాల్, మంజీత్ ఛిల్లర్, దీపక్ హూడా కీలకం కానున్నారు. ఇక తన ప్రత్యర్థి థాయ్‌లాండ్ ఈసారి టోర్నీకి పూర్తిగా యువ ఆటగాళ్లను బరిలోకి దించింది. ఈ జట్టు కూడా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్‌గా నిలిచింది.

తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై చివర్లో 8 పారుుంట్లు సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అందుకే ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా భారత్ ఆడాల్సి ఉంది. ఇక లీగ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్లిన కొరియా జట్టు... ఎక్కువగా తమ స్టార్ రైడర్ జన్ కున్ లీపై ఆధారపడింది. భారత్, బంగ్లాదేశ్‌లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లోనూ తనే చివర్లో చెలరేగి జట్టును గట్టెక్కించాడు. అరుుతే పటిష్ట డిఫెన్‌‌స ఉన్న ఇరాన్‌ను ఓడించాలంటే శక్తికి మించి ఆడాల్సిందే..

మరిన్ని వార్తలు