రైనా.. పాస్‌వర్డ్‌ ప్లీస్‌

1 Nov, 2017 10:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య కాన్పూర్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా క్రికెట్‌ వ్యాఖ్యాత మయాంతి లాంగర్‌, క్రికెటర్‌ సురేష్‌ రైనా మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దీనిని మయాంతి స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాన్పూర్‌ వన్డే జరుగుతున్న సమయంలో మయాంతి తన మొబైల్‌ ఫోన్‌లో వైఫై నెట్‌వర్క్స్‌ చూస్తున్న సమయంలో అందులో సురేష్‌ రైనా అని కనిపించింది. వెంటనే మయాంతి.. సురేష్‌ రైనాకు వైఫై పాస్‌వర్డ్‌ చెప్పాలంటూ మెసేజ్‌ పెట్టింది. స్క్రీన్‌ షాట్‌ ఫొటోల్లో థర్డ్ అంఫైర్‌ వైఫై కూడా కనిపించడం విశేషం.

మయాంతి ట్వీట్‌కు సురైష్‌ రైనా స్పందించలేదు.. అయితే క్రికెట్‌ అభిమానులు మాత్రం విపరీతంగా ప్రతిస్పందించారు. ఒకరైతే.. ధోని పాస్‌వర్డ్‌ కోసం ట్రై చేయమంటే..  మరొకరు.. రైనా దగ్గరి వ్యక్తిని అడగండి అని, ఇంకొకరు అయితే.. నో షార్ట్స్‌ బాల్స్‌ ప్లీస్‌ అంటూ రీ ట్వీట్‌ చేశారు. సురేష్‌ రైనా టీమిండియాకు దూరమై చాలా కాలమైంది. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఈ మధ్యే సురేష్‌ రైనా తెలిపారు.

మరిన్ని వార్తలు