దేవేంద్రోకు పతకం ఖాయం

23 Jun, 2017 00:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ దేవేంద్రో సింగ్‌ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతోన్న ఈటోర్నీ 52 కేజీల వెయిట్‌ కేటగిరీలో దేవేంద్రో సింగ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

దీంతో దేవేంద్రోకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. గురువారం జరిగిన బౌట్‌లో దేవేంద్రో సింగ్, రష్యాకు చెందిన దిమిత్రి యుసుపోవ్‌పై గెలుపొంది పతకపోరుకు సిద్ధమయ్యాడు. 

మరిన్ని వార్తలు