బాలీవుడ్ సినిమాపై మనసు పడ్డ టైసన్

2 Feb, 2016 19:49 IST|Sakshi

ముంబై:  బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న సాలా ఖదూస్ సినిమాను తాను  చూడాలనుకుంటున్నానని  బాక్సింగ్ కింగ్  మైక్ టైసన్   తెలిపాడు.  'నేను బాక్సింగ్ సినిమా చూడాలని అనుకుంటున్నా' అంటూ టైసన్ తన అఫీషియల్  ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నాడు.  ఇప్పటికే రెండు అంతర్జాతీయ సినిమాల్లో నటించిన టైసన్  సోషల్ మీడియాలో  తన కోరికను అభిమానులతో పంచుకున్నాడు.

బాక్సింగ్ కోచ్ జీవితం ఆధారంగా  రూపొందిన ఈ సినిమా  చూడ్డానికి తాను ఆసక్తిగా ఎదురు  చూస్తున్నానన్నాడు.  దీంతో ఇప్పటికే పలువురి ప్రశంసలందుకుంటున్న  మూవీకి భారీగా క్రేజ్ క్రియేట్ అయింది.   20 యేళ్ల అతిచిన్న వయసులోనే ప్రపంచ బాక్సింగ్ రంగంలో అనేక టైటిల్స్ ను అందుకుని  బాక్సింగ్ లెజెండ్ గా  ఖ్యాతి  గడించాడు.  ఇపుడు ఈ బాక్సింగ్ యోధుడు ఓ ఇండియన్ సినిమా చూస్తానని చెప్పడం ఆసక్తి కరంగా మారింది. 

అటు ఇప్పుడు అత్యుత్తమ బాక్సర్ నుంచి కూడా ఇలాంటి కామెంట్ రావడంతో.. దర్శకురాలు సుధ కొంగర ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.  అసలు ఈ మూవీలో కోచ్ కేరక్టర్ ని టైసన్ ని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేసినట్లు గతంలో  చెప్పారు. 'నేను కోచ్ మాటలు విన్నరోజున ఖచ్చితంగా గెలుస్తాను పెడచెవిన పెట్టిన రోజు ఓడిపోయాను.' అని మైక్ టైసన్ మాటలు తనకు  స్ఫూర్తి అని తనమూవీ కూడా ఇదే థీమ్ తో ఉంటుందని తెలిపారు.  


కాగా మాధవన్.  రితికా సింగ్  ల అద్భుతమైన నటన, సినిమా కథాకథనాల బలంతో ఇప్పటికే చాలా సంచలనాలకు వేదికైన ఈ మూవీ  మరెన్ని  బోలెడు రికార్డులు  క్రియేట్ చేయనుందో  వేచి చూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు