ఉత్తమ క్రికెటర్‌గా జాన్సన్

15 Nov, 2014 00:19 IST|Sakshi
ఉత్తమ క్రికెటర్‌గా జాన్సన్

దుబాయ్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్... ఐసీసీ ‘ఉత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)’గా ఎంపికయ్యాడు. అలాగే ఈ ఏడాది ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు కూడా అతనికే దక్కింది. 2009లోనూ జాన్సన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచాడు. ఈ అవార్డును రె ండుసార్లు గెలిచిన రెండో క్రికెటర్ జాన్సన్. గతంలో పాంటింగ్ 2006, 2007లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డు గెలిచాడు. మిగిలిన అనేక విభాగాల్లో భారత క్రికెటర్లు రేసులో నిలిచినా... ఎవరికీ అవార్డు దక్కలేదు. అయితే భువనేశ్వర్ కుమార్‌కు ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ దక్కడం ఒక్కటే భారత్‌కు ఊరట.

 ఐసీసీ ప్రకటించిన ఇతర అవార్డుల విజేతలు
 ఉత్తమ వన్డే క్రికెటర్: డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
 ఉత్తమ మహిళా వన్డే క్రికెటర్: సారా టేలర్ (ఇంగ్లండ్)
 ఎమర్జింగ్ క్రికెటర్: గ్యారీ బాలెన్సీ (ఇంగ్లండ్)
 టి20 ఉత్తమ ప్రదర్శన: ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
 ఉత్తమ మహిళా టి20 క్రికెటర్: మెగ్ లానింగ్
 (ఆస్ట్రేలియా)
 స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు: క్యాథరీన్ బ్రూంట్
 (ఇంగ్లండ్)
 అసోసియేట్, అఫిలియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: ప్రీస్టన్ మమ్‌సెన్ (స్కాట్లాండ్)
 ఉత్తమ అంపైర్: రిచర్డ్ కెటెల్‌బరో.

>
మరిన్ని వార్తలు