మరోసారి మెరిసిన సూర్యకుమార్‌

6 May, 2018 17:56 IST|Sakshi

సాక్షి, ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. స్థానిక వాంఖేడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ జట్టుకు 182 పరుగుల లక్ష్యాన్ని ముంబై నిర్దేశించింది. ముంబై ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(59; 39బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరవడంతో పాటు ఎవిన్‌ లూయిస్‌(43; 23బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బాధ్యతాయుతంగా ఆడాడు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్‌ ను రస్సెల్‌ ఔట్‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌(11) నిరుత్సాహపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌తో కలిసి మరో ఓపెనర్‌ సూర్యకుమార్‌ ఇన్నింగ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రస్సెల్‌ విడదీశాడు. సూర్యకుమార్‌ను ఔట్‌ చేసి కేకేఆర్‌కు మరో బ్రేక్‌ ఇచ్చాడు. స్కోరును పెంచే క్రమంలో కృనాల్‌ పాండ్యా(14) వెనుదిరిగాడు. దాంతో ముంబై స్కోరు బోర్డు నెమ్మదించింది. కాగా, చివర్లో హార్దిక్‌ పాండ్యా(35 నాటౌట్‌; 20 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌), డుమినీ(13నాటౌట్‌)లు సమయోచితంగా ఆడటంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌, రస్సెల్‌ తలో రెండు వికెట్లు సాధించారు.


 

>
మరిన్ని వార్తలు