'బీసీసీఐతో నా అనుబంధం ముగిసింది'

2 Jan, 2017 15:54 IST|Sakshi
'బీసీసీఐతో నా అనుబంధం ముగిసింది'

న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అనురాగ్ ఠాకూర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటిస్తుండగా, షిర్కే మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇందులో క్షమాగుణం ఏమీ ఉండదు. బీసీసీఐని వదిలి నన్ను వెళ్లిపోమని సుప్రీం ఆదేశించింది. అక్కడితో బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇంకేమీ ఉండదు కూడా' అని షిర్కే తెలిపారు.  తనకు ప్రత్యేకమైన కోరికలు కూడా ఏమీ లేవని పేర్కొన్న షిర్కే.. బీసీసీఐలో కొత్తగా బాధ్యతలు స్వీకరించేవారు బాగా పరిపాలిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

బీసీసీఐతో తనకు వ్యక్తిగత సంబంధం ఏమీ లేదన్నారు. ఈ పదవిని వదిలేయడం వల్ల తనకు ఏమీ నష్టం ఉండదన్నారు. తనకు చాలా పనులున్నాయని, వాటిని చూసుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు. గతంలో తాను ఈ పదవిని చేపట్టేబోయే ముందు చాలా అభ్యంతరాలు వచ్చిన విషయాన్ని షిర్కే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక బీసీసీఐతో తన అనుబంధం ముగిసిపోయిందని యూకేలో ఉన్న షిర్కే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు.


ధా కమిటీ సిఫారుసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది.  ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పును ప్రకటించింది.

లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడిగా  ఉన్న అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారుసును వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చారు.  దాంతో సుప్రీంకోర్టు ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు బోర్డులో ప్రధాన పదవుల్లో ఉన్న అనురాగ్, షిర్కేలను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు