నితీశ్‌ యాదవ్‌ గెలుపు

22 Mar, 2018 10:50 IST|Sakshi

 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సుభాష్‌ చంద్రబోస్, శివలాల్‌ యాదవ్‌ ఎమ్మెల్యే రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కేవీబీఆర్‌ స్టేడియానికి చెందిన నితీశ్‌ యాదవ్‌ గెలుపొందాడు. ధూల్‌పేట్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 84 కేజీల పురుషుల విభాగంలో జై భవానీ వ్యాయామశాలకు చెందిన రూపేశ్‌పై నితీశ్‌ విజయం సాధించాడు.

ఇదే వెయిట్‌ కేటగిరీలో జరిగిన ఇతర బౌట్‌లలో మణితేజ (గచ్చిబౌలి)పై మోహన్‌ గాంధీ (షణ్ముక పహిల్వాన్‌), డి. విశాల్‌ (న్యూ వలీమ్‌ వ్యాయామశాల)పై భీమా (కార్వాన్‌), కరణ్‌ సింగ్‌పై విశాల్‌ యాదవ్‌ (శ్రీరామ్‌ వ్యాయామశాల), జి. శంకర్‌ (ఎంసీహెచ్, జియాగూడ)పై బి. మహేశ్‌యాదవ్‌ (తెలంగాణ పోలీస్‌), పి. సురేశ్‌ (గోవింద్‌రామ్‌ ఉస్తాద్‌)పై ఎ. మనోజ్‌ కుమార్‌ (యూసుఫ్‌గూడ), ఎ. అజయ్‌ (మారుతి కరణ్‌ ఉస్తాద్‌)పై ముకేశ్‌ సింగ్‌ (గోవింద్‌ రామ్‌ ఉస్తాద్, సీతారాంబాగ్‌) విజయం సాధించారు. 74 కేజీల విభాగంలో జి. తరుణ్‌ యాదవ్‌ (సూరి పహిల్వాన్‌)పై, కునాల్‌ సింగ్‌ (లాలా తాలీమ్‌) గెలుపొందాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు