టోర్నీ మధ్యలోనే తప్పుకొన్న వరల్డ్ నంబర్ 1

26 Feb, 2016 10:37 IST|Sakshi
టోర్నీ మధ్యలోనే తప్పుకొన్న వరల్డ్ నంబర్ 1

దుబాయ్: వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గురువారం క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయిన తర్వాత తనకు కంటి సమస్య తలెత్తిందని భావించిన జోకో మ్యాచ్ కొనసాగించలేనని చెప్పడంతో అంపైర్ మ్యాచ్ ను నిలిపివేశాడు. చివరిసారిగా 2011లో అర్జైంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో తలపడ్డ మ్యాచ్ మధ్యలోనే జోకోవిచ్ ఆట నుంచి తప్పకున్నాడు.

మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ 4, స్విస్ వీరుడు స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-1తేడాతో జర్మనీ ప్లేయర్ కొల్స్క్రేబర్ పై విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్ లో వావ్రింకా ఏడు ఎస్ లు సంధించగా జర్మనీ ఆటగాడి నుంచి సమాధానమే లేకపోయింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ లలో బాగ్ధటిస్ 7-5, 6-0 తేడాతో స్పెయిన్ కు చెందిన రోబెర్టో బాటిస్టాపై, ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ 6-4, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ థామస్ బెర్డిచ్ పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు