'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'

19 Aug, 2016 14:19 IST|Sakshi
'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'

హైదరాబాద్: ఆరేడేళ్లుగా బ్యాడ్మింటన్ కు క్రేజ్ పెరిగిందని పుల్లెల గోపీచంద్ సతీమణి పీవీవీ లక్ష్మి అన్నారు. గోపీచంద్ శిష్యురాలు పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకున్న నేపథ్యంలో 'సాక్షి' టీవీతో ఆమె మాట్లాడారు. సైనా నెహ్వాల్, కశ్యప్, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సింధు కారణంగా బ్యాడ్మింటన్ కు ఆదరణ పెరిగిందన్నారు. ఇంకా ప్రమాణాలు పెరగాల్సివుందని అభిప్రాయపడ్డారు.

'ఇంకా మనం చదువుల పట్లే మోజు చూపుతున్నాం. తాజా విజయాలు క్రీడలవైపు పిల్లలను మళ్లిస్తాయి. ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్, అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఎవరు ఆడిన ఆయన సహాయపడతారు. గోపీకి తెలిసిన మంత్రం ఇదొక్కటే. కఠోరశ్రమ, అంకితభావం ఆయన సొంతం. జీవిత భాగస్వామిగా ఆయనలో నేను ఇదే చూశాన'ని లక్ష్మి చెప్పారు.

మరిన్ని వార్తలు