మెరిసిన రహానే-పంత్‌ జోడి

13 Oct, 2018 16:05 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో ఇక్కడ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, రిషబ్‌ పంత్‌లు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. తొలుత రహానే హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై వెంటనే రిషబ్‌ పంత్‌ సైతం అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  రహానే 122 బంతుల్లో 4 ఫోర్లు సాయంతో హాఫ్‌ సెంచరీ చేయగా, పంత్‌ 67 బంతుల్లో 9 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. అంతకముందు పృథ్వీ షా(70; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోగా, అటు తర్వాత విరాట్‌ కోహ్లి(45; 78 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. కేఎల్‌ రాహుల్‌(4), చతేశ్వర పుజారా(10)లు నిరాశపరిచారు.

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 311 పరుగులకు ఆలౌటైంది. 295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌.. మరో 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ ఓవర్‌నైట్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ విజృంభించి ఆరు వికెట్లతో సత్తా చాటాడు. భారత జట్టు 66 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.

ఉమేశ్‌ విజృంభణ: విండీస్ ఆలౌట్‌

మరిన్ని వార్తలు