రాహుల్‌కు 3 స్వర్ణాలు

23 Jan, 2015 00:55 IST|Sakshi
రాహుల్‌కు 3 స్వర్ణాలు

యమునానగర్ (హరియాణా): జాతీ య జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆటగాడు రాగాల వెంకట రాహుల్ సత్తా చాటాడు. ఈ పోటీల్లో రాహుల్ 85 కేజీల కేటగిరీలో మూడు స్వర్ణాలు గెలిచాడు.

స్నాచ్‌లో 140 కేజీల బరువెత్తి స్వర్ణం నెగ్గిన అతను, క్లీన్ అండ్ జర్క్‌లో 170 కిలోలు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా మొత్తం 310 కేజీల బరువు ఎత్తిన రాహుల్ స్వర్ణం దక్కించుకున్నాడు.
 

మరిన్ని వార్తలు