అభినవ్ బింద్రా నేతృత్వంలో..

25 Aug, 2016 12:32 IST|Sakshi
అభినవ్ బింద్రా నేతృత్వంలో..

న్యూఢిల్లీ: ఇటీవల రియోలో ముగిసిన ఒలింపిక్స్లో భారత షూటర్ల పేలవ ప్రదర్శనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కమిటీకి షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించనున్నట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సమీక్షలో షూటర్ల వ్యక్తిగత ప్రదర్శను సమీక్షించిన అనంతరం వారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


భారత్ నుంచి హీనా సిద్ధూ, మనవ్ జీత్ సింగ్ సిద్ధూ, గగన్ నారంగ్, జితూ రాయ్, అపూర్వ చండీలా తదితరులతో కూడిన షూటింగ్ బృందం రియోకు వెళ్లిన పతకం సాధించడంలో విఫలమైంది. రియోలో అభినవ్ బింద్రా, జితూ రాయ్లు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఈ నేపథ్యంలో భారత రైఫిల్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తికి గురైంది.

 

ఇటీవల భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ కూడా భారత షూటర్ల రియో ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు.  కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందంటూ షూటర్లకు ముందస్తు హెచ్చరికలు పంపారు.

మరిన్ని వార్తలు