మిక్స్‌డ్‌ ఫైనల్లో బోపన్న జోడి

26 Jan, 2018 16:50 IST|Sakshi
బోపన్న-బాబోస్‌ జోడి

మెల్‌బోర్న్‌:ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంగా రోహన్‌ బోపన్న(భారత్‌)- తైమియా బాబోస్‌(హంగేరి) జంట ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో బోపన్న ద్వయం 7-5, 5-7, 10-6 తేడాతో మార్సిలో డిమోలైనర్‌(బ్రెజిల్‌)- మార్టినెజ్‌ సాంచెజ్‌(స్పెయిన్‌) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.

తొలి సెట్‌ను గెలిచిన బోపన్న జంట.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో తిరిగి పుంజుకున్న బోపన్న ద్వయం ఆ సెట్‌ను గెలవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది.టై బ్రేక్‌కు దారి తీసిన మూడో సెట్‌లో ఆధిక్యంలో నిలిచిన బోపన్న జంట ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. శనివారం జరిగే తుది పోరులో బోపన్న-బాబోస్‌ జోడి.. గాబ్రియేలా డాబ్రోస్కి-మేట్‌ పావిచ్‌ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు