కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’

5 Nov, 2018 16:39 IST|Sakshi

కోల్‌కతా: ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడిగా తనదైన ముద్రవేసిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. కెప్టెన్సీలోనూ తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఇటీవల ఆసియాకప్‌ సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చిన క్రమంలో విండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సారథిగా ఎంపికైన రోహిత్‌ శర్మ ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాల ఘనతను అందుకున్నాడు.

కెప్టెన్‌గా తొలి పది టీ20 మ్యాచ్‌లకు సారథ్య వహించిన జాబితాలో రోహిత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత విజయం సాధించిన తర్వాత రోహిత్‌ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ రోహిత్‌ పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో తొమ్మింది విజయాలు నమోదు చేశాడు. ఫలితంగా మొదటి పది టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన లిస్ట్‌ ప‍్రకారం చూస్తే అత్యంత సక్సెస్‌ ఫుల్‌ రేసులో రోహిత్‌ ముందువరుసలో నిలిచాడు.

ఈ క్రమంలోనే షోయబ్‌ మాలిక్‌, మైకేల్‌ క్లార్క్‌, అస్కార్‌ అప్ఘాన్‌, సర్పరాజ్‌ అహ్మద్‌ల రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు. ఈ నలుగురు తొలి పది అంతర్జాతీయ టీ20లకు గాను ఎనిమిదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్లు కాగా, వారిని రోహిత్‌ అధిగమించాడు. మరొకవైపు తొమ్మిది వన్డేలకు కెప్టెన్‌గా చేసిన రోహిత్‌ ఏడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

మరో రికార్డుకు చేరువలో రోహిత్‌..

మరిన్ని వార్తలు