హడలెత్తించిన సచిత్ నాయుడు

9 Sep, 2016 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో కాన్‌కర్డ్ 7 వికెట్ల తేడాతో హెచ్‌యూసీసీపై విజయం సాధించింది. కాన్‌కర్డ్ బౌలర్లు సచిత్ నాయుడు (6/26), మున్నా తివారీ (4/12) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో గురువారం రెండో ఇన్నింగ్‌‌సలో హెచ్‌యూసీసీ 123 పరుగులకే కుప్పకూలింది. బాలరాజు (52) రాణించాడు. తర్వాత 67 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కాన్‌కర్డ్ రెండో ఇన్నింగ్‌‌సలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్‌‌సలో హెచ్‌యూసీసీ 60, కాన్‌కర్డ్ 117 పరుగులు చేశాయి.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్ : 193 (కృతిక్ రెడ్డి 107; సూర్యతేజ 5/50), పాషా బీడి తొలి ఇన్నింగ్స్ : 455/7 డిక్లేర్డ్, ఆక్స్‌ఫర్డ్ రెండో ఇన్నింగ్‌‌స: 156 (అశోక్ డేవిడ్ 30, కృతిక్ రెడ్డి 33; ప్రవీత్ కుమార్ 4/34).

 ఫ్యూచర్ స్టార్ తొలి ఇన్నింగ్స్ : 380/9 డిక్లేర్డ్ (వికాస్ రావు 155), ఎలిగెంట్ సీసీ తొలి ఇన్నింగ్స్ 115 (అరుణ్ రాథోడ్ 6/29, అంకిత్ అగర్వాల్ 4/37), ఎలిగెంట్ సీసీ రెండో ఇన్నింగ్‌‌స: 80 (శ్రీధర్ రెడ్డి 5/20).

 రాకేశ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 352/9 డిక్లేర్డ్, ఉ స్మానియా తొలి ఇన్నింగ్స్ 318 (సిద్ధాంత్ 115, కృపాకర్ 40; విఘ్నేశ్ 3/86), రాకేశ్ రెండో ఇ న్నింగ్‌‌స: 109/6 (హుస్సేన్ 33; కృపాకర్ 3/36).

 పోస్టల్ తొలి ఇన్నింగ్స్  187, న్యూబ్లూస్ తొలి ఇన్నింగ్స్ : 64, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ : 113 (భరత్ 43; వరప్రసాద్ 5/28, భార్గవ్ ఆనంద్ 4/14).


  గెలాక్సీ తొలి ఇన్నింగ్స్: 125/9 డిక్లేర్డ్, శ్రీచక్ర తొలి ఇన్నింగ్‌‌స:72 (నిఖిల్ 48; ఆశిష్ 5/33, దీపక్ 327), గెలాక్సీ రెండో ఇన్నింగ్‌‌స: 135 (భరత్ కుమార్ 5/39), శ్రీచక్ర రెండో ఇన్నింగ్‌‌స: 143 (లోక్‌నాథ్ 38; సంహిత్ రెడ్డి 6/62).

  చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 247, తెలంగాణ తొలి ఇన్నింగ్స్ : 140/9 డిక్లేర్డ్ (రాకేశ్ 30, నర్సింగ్ రావు 52; విఘ్నేశ్ 4/10), తెలంగాణ రెండో ఇన్నింగ్‌‌స: 148/3 (రాకేశ్ 60 నాటౌట్).


  ఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 145, రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 109, ఎంసీసీ రెండో తొలి ఇన్నింగ్స్: 253/3 డిక్లేర్డ్ (సంతోష్ 115, దీపక్ 46), రాజు సీసీ రెండో తొలి ఇన్నింగ్స్: 139/7 (వివేకానంద్ 73; మనోజ్ కుమార్ 4/41).


  హైదరాబాద్ టైటాన్స్ తొలి ఇన్నింగ్స్ : 274, డబ్ల్యూ ఎంసీసీ  తొలి ఇన్నింగ్స్: 306 (హబీబ్‌వలి 60, నాగరాజు 107, సమన్విత్ 68; సాక్ష్యం గోగియా 6/71), టైటాన్‌‌స రెండో ఇన్నింగ్‌‌స: 235 (నయీం 40, సిద్దిఖ్ అఫ్సర్ 82; యశ్వంత్ 3/75).

 

మరిన్ని వార్తలు