రొమాన్స్ విషయాలపై నటి ఆగ్రహం..! | Sakshi
Sakshi News home page

రొమాన్స్ విషయాలపై నటి ఆగ్రహం..!

Published Fri, Sep 9 2016 10:29 AM

రొమాన్స్ విషయాలపై నటి ఆగ్రహం..!

తాను ఎవరితో రొమాన్స్ చేశానన్న విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని హాలీవుడ్ నటి ఈజా గోంజాలెజ్ అంటోంది. ఈ అమ్మడు ఇలా చిర్రుబుర్రలాడటానికి ఓ కారణం ఉంది. ఆమె గత కొన్ని రోజులుగా డీజే కెల్విన్ హ్యారిస్ తో డేటింగ్ చేస్తోంది. అయితే వీరి ప్రేమాయణం గురించి ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఈ మెక్సికన్ సింగర్, నటి గోంజాలెజ్ పలు సందర్భాలలో ప్రియుడు హ్యారిస్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. గత వారం కూడా ఓ ఈవెంట్లో ఈ ఇద్దరూ జంటగా పాల్గొన్నారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు.

ప్రేక్షకులు, అభిమానులు నిజంగానే తనను ప్రేమించినట్లయితే తాను నటించిన మూవీలలో పాత్రల్లో మాత్రమే గుర్తుపెట్టుకుంటే బాగుండేదని హితవు పలికింది. అయితే తన సినిమాలకు బదులుగా కేవలం కాల్విన్ హ్యారిస్ గురించి మాత్రమే ఎందుకు పదే పదే అడుగుతారంటూ స్థానిక మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటింగ్, ప్రేమ, ఇతర వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను.. ఆ విషయాలను అందరికి చెప్పాల్సిన అవసరం తనకు లేదని మెక్సికన్ భామ గోంజాలెజ్ అభిప్రాయపడింది.

Advertisement
Advertisement