ఆమె అరుదైన క్రీడాకారిణి

8 Sep, 2015 18:39 IST|Sakshi
ఆమె అరుదైన క్రీడాకారిణి

గత వారం మిలియన్ డాలర్ల ఎండార్స్ మెంట్ సాధించిన ఇండియన్ ఏస్ షట్లర్ సైనాపై ప్రపంచ బాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ థామస్ ప్రశంసల జల్లుకురిపించాడు. ఆటలో సత్తాచాటితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పేందుకు సైనా చక్కటి ఉదాహరణ అని కితాబిచ్చారు. ఎడెల్ వీస్ తో 3.7 మిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకున్న సైనా ను ఆయన పొగడ్తలతో ముంచెత్తాడు.సైనా తనతో పాటు ఆటకు గుర్తింపు తెచ్చిన అరుదైన క్రీడాకారిణి అని అన్నారు. ఇలాంటి క్రీడాకారులకు ఫెడరేషన్ అన్నివిధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

మరో వైపు గత దశాబ్ద కాలంలో బాడ్మింటన్ ఆట ఎంతో పురోగమించిందని అభిప్రాయపడ్డారు. మహిళా బాడ్మింటన్ క్రీడాకారిణి మిలియన్ డాలర్ల ఎండార్స్ మెంట్ పొందడం దీనికి ఉదాహరణ అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ ఆటను ప్రమోట్ చేస్తున్నామని.. అన్ని దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకు రావడం తమ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ప్రస్తుతం ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ గ్రూప్ 3 ఆటగా స్ధానం సంపాదిచిందని.. భవిష్యత్ లో మరింత పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

>
మరిన్ని వార్తలు