క్రికెట్‌ ప్లేయరా..  టెన్నిస్‌ ప్లేయరా?

9 Apr, 2020 14:56 IST|Sakshi

హైదరాబాద్‌:  భారత టెన్నిస్‌ చరిత్రలో తనదైన ముద్ర  వేసిన హైదరాబాద్‌ మహిళా స్టార్‌ ప్లేయర్‌  సానియా మీర్జా.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.. ఈ క్రమంలోనే ప్రతీ ఒ‍క్కరూ లాక్‌డౌన్‌ పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తూనే సోషల్‌ మీడియాలో అభిమానుల్ని అలరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లాక్‌డౌన్‌ పాటిస్తున్న కొందరు మహిళా సెలబ్రిటీలు వంటలు చేసే ఫోటోలను నెట్‌లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా.. తాజాగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో  కుమారుడు ఇజాన్స్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు.(జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా)  

చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఇజాన్స్‌ ఫోటో పెట్టిన సానియా..  ఏమి ఆలోచిస్తున్నాడో కచ్చితంగా చెప్పగలను అంటూ కామెంట్‌ చేశారు. అయితే దీనికి నెటిజన్లు భిన్నమైన ప్రశ్నలు సంధిస్తున్నారు.  సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ క్రికెటర్‌ కావడంతో ఇజాన్స్‌ను ఏమి చేస్తారు అనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. మీ ముద్దుల తనయుడు ఇజాన్స్‌ను క్రికెటర్‌ ప్లేయర్‌ చేస్తారా.. లేక  టెన్నిస్‌ ప్లేయర్‌ చేస్తారా’ అని ఒక అభిమాని అడగ్గా, మరొక అభిమాని మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎడమ చేతిలో కూడా బ్యాట్‌ ఉంది’ అని సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక పాకిస్తాన్‌ పేసర్‌ వహాబ్‌ రియాజ్‌ మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నాడని కామెంట్‌ చేశాడు. 

సుమారు మూడేళ్ల  పాటు సానియా మీర్జా టెన్నిస్‌కు దూరమయ్యారు. ఇజాన్స్‌కు జన్మనిచ్చే క్రమంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవలే తన రీఎంట్రీ ఇచ్చిన సానియా.. కరోనా వైరస్‌ కారణంగా మరోసారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టోర్నీలు రద్దు కావడంతో పాటు పలు క్రీడా ఈవెంట్‌లు కూడా వాయిదాలు పడ్డాయి. 

మరిన్ని వార్తలు