శివాని జోడీకి టైటిల్‌

9 Dec, 2017 10:35 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–3 టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి అమినేని శివాని సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి ఆకాంక్ష భాన్‌తో కలిసి డబుల్స్‌ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ శివాని–ఆకాంక్ష (భారత్‌) ద్వయం 3–6, 6–2, 10–3తో సాల్సా అహర్‌ (భారత్‌)–షియోరి ఇటో (జపాన్‌) జంటపై విజయం సాధించింది. సింగిల్స్‌ విభాగంలో శివాని పోరాటం సెమీస్‌లో ముగిసింది. సింగిల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ శివాని 5–7, 0–6తో టాప్‌ సీడ్‌ ఆకాంక్ష చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని వార్తలు