సెమీస్‌లో శ్యామ్‌కుమార్, హుస్సాముద్దీన్‌

24 Jun, 2017 00:50 IST|Sakshi
సెమీస్‌లో శ్యామ్‌కుమార్, హుస్సాముద్దీన్‌

► కనీసం కాంస్యాలు ఖాయం
► క్వార్టర్స్‌లో మేరీకోమ్‌ ఓటమి  


న్యూఢిల్లీ: ఉలాన్‌బాటర్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌... తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌లు పతకాలను ఖాయం చేసుకున్నారు. మంగోలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో వీరికి కనీసం కాంస్య పతకం దక్కనుంది.

క్వార్టర్స్‌లో శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) మంగోలియాకు చెందిన ఎన్‌కాందాఖ్‌ కర్కూపై గెలుపొందగా... హుస్సాముద్దీన్‌ (56 కేజీలు) చైనా బాక్సర్‌ మా జిన్‌ మింగ్‌ను ఓడించాడు. వీరితో పాటు క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన అంకుశ్‌ దహియా (60 కేజీలు) డుల్గన్‌ (మంగోలియా)పై, ప్రియాంక చౌదరి (60 కేజీ) అలెక్సాండ్రా ఓర్డినా (రష్యా)పై నెగ్గి సెమీస్‌లో అడుగు పెట్టారు. మరోవైపు ఏడాది తర్వాత రింగ్‌లో అడుగుపెట్టిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)కొరియాకు చెందిన చోల్‌ మి బంగ్‌ చేతిలో ఓటమి పాలై క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.

మరిన్ని వార్తలు